Header Banner

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

  Sat May 17, 2025 16:00        India

ముంబై నగరంలో నేడు తీవ్ర కలకలం రేగింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రఖ్యాత తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ రెండు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి నుంచి పోలీసులకు ఒక ఈ-మెయిల్ వచ్చింది. విమానాశ్రయం, తాజ్ హోటల్‌లో శక్తివంతమైన పేలుళ్లు జరుపుతామని హెచ్చరించాడు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కలిసి పోలీసులు రెండు ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంటల తరబడి సాగిన ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ, పేలుడు పదార్థాలు గానీ లభించలేదు. అనంతరం, ఈ బెదిరింపు ఈ-మెయిల్ నకిలీదని విమానాశ్రయ పోలీసులు నిర్ధారించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఆకతాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ-మెయిల్ ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో ఆయా ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తనిఖీల అనంతరం అంతా సవ్యంగా ఉందని తెలియడంతో ప్రయాణికులు, హోటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

 

జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!

 

ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Mumbai #IndiansIPL #Indian #PremierLeagueSixes #MostSixesinIPL #RCB #CSK #KKR #IPL #2025Cricket